VSP: దసరా ఉత్సవాల సందర్భంగా ప్రశాంత వాతావరణానికి సహకరించాలని, హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని మల్కాపురం సీఐ అప్పారావు యాదవ్ రౌడీషీటర్లను హెచ్చరించారు. ఆదివారం స్టేషన్ వద్ద రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్సవాల్లో ఎలాంటి అల్లర్లకు పాల్పడకూడదని హెచ్చరించారు.