KDP: కడప నగరంలోని రవీంద్రనగర్ ప్రజల చిరకాల కోరిక నెరవేరనుంది. ఈ మేరకు దశాబ్దాలుగా స్థానిక ప్రజలు ఎదురుచూస్తున్న షామీరియా, లా కాలేజ్ బ్రిడ్జీల నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి కడప టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే మాధవి రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాగా, త్వరలోనే నిర్మాణాలను పూర్తి చేస్తామని ఆమె తెలిపారు.