PLD: నరసరావుపేట పట్టణంలో సర్దార్ భగత్ సింగ్ 118వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. AISF–AIYF జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జయంతి సందర్భంగా సర్దార్ భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా AISF, AIYF నాయకులు, విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.