»Prabhas With The Producers Of Baahubali This Is More Than That
Prabhas : బాహుబలి నిర్మాతలతో ప్రభాస్.. ఇది అంతకు మించి!
ప్రభాస్ 'బాహుబలి' నిర్మాతలతో ఓ సినిమా చేయడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే స్టోరీ కూడా లాక్ చేశారట. ఈ సినిమా ప్రభాస్ కెరీర్లోనే అద్భుతం అనేలా ఉండబోతోందట.
ఈ రోజు ప్రభాస్(Prabhas), రాజమౌళి లేకపోతే.. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలు ఉండకపోయేవి. బాహుబలి (Bahubali) సినిమాతో ప్రభాస్, రాజమౌళి పాన్ ఇండియా స్టార్డమ్స్ అందుకున్నారు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న టాప్ హీరో, టాప్ డైరెక్టర్ ప్రభాస్, రాజమౌళినే అనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఏకంగా మూడు వేల కోట్ల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ రాజమౌళి, మహేష్ బాబుతో వెయ్యి కోట్ల ప్రాజెక్ట్‌తో రెండు వేల టార్గెట్‌గా బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నాడు. అయితే ఈ బాహుబలి కాంబోకి సపోర్ట్‌గా మెయిన్ పిల్లర్‌గా నిలిచింది మాత్రం నిర్మాతలే. బాహుబలి సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా.. ఆర్కా మీడియా వర్క్స్ పై శోభు యార్లగడ్డ(Sobhu Yarlagadda), ప్రసాద్ దేవినేని నిర్మించారు.
ప్రభాస్, రాజమౌళి(Rajamouli)కి ఎంత పేరొచ్చిందో.. బాహుబలి సినిమాతో వీళ్లకు అంతే క్రెడిట్ దక్కింది. అయితే మళ్లీ వీళ్లతో మరో సినిమా చేయలేదు ప్రభాస్. తన హోమ్ బ్యానర్ యువి క్రియేషన్స్, టీ సిరీస్ సంస్థలతోనే ప్రభాస్ ఎక్కువగా సినిమాలు చేస్తున్నాడు. అయితే.. ఇప్పుడు ప్రభాస్ ‘బాహుబలి’ నిర్మాతలతో ఓ సినిమా చేయడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే స్టోరీ కూడా లాక్ చేశారట. ఈ సినిమా ప్రభాస్ కెరీర్లోనే అద్భుతం అనేలా ఉండబోతోందట. డిఫెరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కున్న ఈ సినిమాలో.. ఇప్పటి వరకు ప్రభాస్ చేయని క్యారెక్టర్ చేయబోతున్నాడని అంటున్నారు. అయితే ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్సెస్ తక్కువ.. ప్రభాస్ కమిట్మెంట్స్ అయిపోయాక ఉండనుంది. ప్రస్తుతానికి ఈ క్రేజీ కాంబో ఫిక్స్ అయిందనే న్యూస్ మాత్రం.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఎగ్జైట్మెంట్గా మారింది. మరి ఈ సారి బాహుబలి కాంబో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.