NLG: ఈనెల 29న, సోమవారం సద్దుల బతుకమ్మ పండుగ జరుపు కోవాలని చిట్యాల పట్టణానికి చెందిన ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ ప్రజలకు సూచించారు. బతుకమ్మ పండుగను పుష్ప గౌరీ వ్రతం అని పిలుస్తారని, తొమ్మిది రోజులకు సద్దుల బతుకమ్మ ఆచరించడం సరైన పద్ధతని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి అపోహలను నమ్మవద్దని అన్నారు.