మహారాష్ట్ర(Maharashtra)లో మూడో బహిరంగ సభకు భారత రాష్ట్ర సమితి (BRS) సర్వం సిద్దం అయింది. ఔరంగాబాద్(Aurangabad)లోని జబిందా మైదానంలో.. ఇవాళ జరిగే సభకు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) హాజరుకానున్నారు. గతంలో నాందేడ్(Nanded), కాందర్ లోహ సభలతో మహారాష్ట్ర రాజకీయాల్లో దృష్టిని ఆకర్షించిన బీఆర్ఎస్.. ఇప్పుడు ఔరంగబాద్(Aurangabad)లో అడుగు పెడుతోంది. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ (BRS) ప్రజలను, నేతలను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రం నుంచి వెళ్లిన నేతలు అక్కడ జనసమీకరణపై కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నారు. అమిత్‌షా ఆరోపణలతో పాటు రాష్ట్రంలో ఇటీవలి పలు పరిణామాలపై మరాఠా గడ్డపై గులాబీ దళపతి స్పందిస్తారా..? లేదా..? అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. నేడు ఔరంగాబాద్ ఛత్రపతి శంభాజీనగర్(Shambhajinagar)లోని జబిందా మైదానంలో బీఆర్ఎస్ సభను నిర్వహిస్తోంది. ఈ సభకు బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ హాజరకానున్నారు. రాష్ట్రం నుంచి వెళ్లిన బీఆర్ఎస్ నేతలు అక్కడ జనసమీకరణపై కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి(MLA Jeevan Reddy) ,షకీల్, బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ సహా తదితరులు కొంతకాలంగా ఔరంగబాద్‌లోనే ఉండి సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.