ASF: అడవిలో అనుమానాస్పదంగా చనిపోయిన దూలం శేఖర్-సుశీల దంపతుల మృతిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. సిర్పూర్ (టి)లోని అచ్చల్లికి చెందిన దంపతుల మృతదేహాలు శుక్రవారం తెల్లవారుజామున భీమన్నదేవర అటవీ ప్రాంతంలో లభ్యమయ్యాయి. అయితే ఎలుగు బంటి దాడి చేయడం వల్లే వారు మృతి చెందారని అటవీశాఖ అధికారులు ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేశారు.