ప్రకాశం: సైకో గాడు అని సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పాలని వైసీపీ ఇంటలెక్చువల్ విభాగం అధ్యక్షులు, గొబ్బూరు సర్పంచ్ అంగిరేకుల ఆదినారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం మార్కాపురం వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బాలకృష్ణ జేబులో మెంటల్ సర్టిఫికెట్ పెట్టుకుని ఏమైనా తిట్టొచ్చు అనుకుంటే ఊరుకోమన్నారు.