TG: OG టికెట్ ధర పెంపుపై నిర్మాత తరపు లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టులో కీలక వ్యాఖ్యలు చేశారు. పెంచిన టికెట్ ధరలతో సినిమా చూడాలంటే.. పిటిషనర్‌కు కష్టం అనుకుంటే.. సాధారణ రేటు ఉన్నప్పుడే సినిమా చూడాలన్నారు. ఐపీఎల్ టికెట్ రూ. 1500, దిల్జీత్ షో టికెట్ రూ. 10 వేలు ఉంటే రూ. 200కే కావాలని ఎందుకు అడగట్లేదని వ్యాఖ్యానించారు.