గత ప్రభుత్వం హయాంలో ఎస్పీడీసీఎల్లో అక్రమాలు జరిగాయని, ఆ భారం ఇప్పుడు వినియోగదారులపై వేస్తున్నారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి శాసనమండలిలో ఆరోపించారు. రూ. 220 కోట్లతో అక్రమంగా జగనన్న కాలనీలకు విద్యుత్ పరికరాలను కొనుగోలు చేశారని, ఇల్లు పూర్తికాక అప్పుడు వాటిని వినియోగించలేదని, ఇప్పుడు కొత్త సర్వీసులకు వాటిని అంటగడుతున్నారని ఆయన ఆరోపించారు.