SRD: పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టుకు 88,623 క్యూసెక్కులు భారీ వరద వచ్చి చేరుతోంది. దీంతో శుక్రవారం మధ్యాహ్నం మరో గేటు ఎత్తి,10 గేట్ల ద్వారా దిగువకు మంజీరా నదిలో 89 వేలు క్యూసెక్కులు వదిలినట్లు ప్రాజెక్టు ఫస్ట్ ఇంజనీర్ స్టాలిన్ తెలిపారు. అయితే మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.