TPT: లింగాల మండలం ఇప్పట్ల సచివాలయాన్ని డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్(డీఎల్డీవో) విజయలక్ష్మి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం లేకుండా చూడాలన్నారు.