VSP: గాజువాక జోన్లోని శుక్రవారం నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని జీవీఎంసీ వాటర్ సప్లై సహాయ ఇంజనీరు కేదార్నాథ్ తెలిపారు. సుందరయ్య కాలనీలోని 10 ఎంజీడీ మంచినీటి శుద్ధి కర్మాగారానికి ముడి నీరు సరఫరా చేసే 1000 ఎంఎం డయా పైప్లైన్కు రైల్వే ట్రాక్ వద్ద అత్యవసర మరమ్మతులు చేపట్టనున్నారు. దీంతో 64, 65, 70 నుంచి 74, 76వ వార్డులలో నీటిసరఫరా ఉండదు.