AP: మాజీ సీఎం జగన్ను ఎమ్మెల్యే బాలకృష్ణ సైకో అని సంబోధించారు. గతంలో సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్ బయటికి వచ్చారని కామినేని చెప్పడం అవాస్తవమని అన్నారు. అక్కడ ఎవరూ గట్టిగా అడగలేదని, సినిమా ఇండస్ట్రీ మంత్రిని కలవమని మాత్రమే చెప్పారని బాలకృష్ణ స్పష్టం చేశారు.