ELR: నూజివీడు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో స్పోర్టింగ్ క్లబ్ సభ్యులు గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ పగడాల సత్యనారాయణ, కో ఆప్షన్ సభ్యులు రామిశెట్టి మురళీకృష్ణ కుమార్లు మాట్లాడుతూ.. రెండవ మైసూరుగా పేరుగాంచిన నూజివీడులో దసరా సందర్భంగా 73 ఏళ్లుగా చెడుగుడు పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.