SRPT: హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 150 నిఘా కెమెరాలను సీఐ చరమంద రాజు పరిశీలించారు. నేరాల నియంత్రణ కోసం సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. పట్టణంలో ప్రధాన కూడలితో పాటు ప్రధాన రోడ్డు మార్గాల్లో కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలో పట్టణంలో నిఘా కెమెరాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.