KRNL: ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలంలో ఇవాల స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సుదర్శన హోమం నిర్వహించారు. ప్రధాన అర్చకుడు కిడాంబి వేణుగోపాల్ స్వామి నేతృత్వంలో పూజలు జరిగాయి. శ్రీ ప్రహ్లాద వరద స్వామి శ్రీదేవి భూదేవి అమ్మ వార్లకు విశేష అలంకారాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.