VSP: విశాఖ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య, వాహన రద్దీ, నిబంధనల ఉల్లంఘన వంటి సమస్యల పరిష్కారానికి సాంకేతికతను వినియోగించడంపై గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ భరత్, కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి పాల్గొన్నారు.