ATP: అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లిలో ‘ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్’ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆనంద్ పాల్గొని స్వయంగా చీపురితో చెత్తాచెదారాన్ని తొలగించారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యంగా ఉంటామని కలెక్టర్ తెలిపారు. జిల్లా, మండల అధికారులు, కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.