AP: మున్సిపల్ చట్టం సవరణ బిల్లును అసెంబ్లీలో మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. నాలా చట్టం ద్వారా భవన నిర్మాణదారులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. నిర్మాణదారుల ఇబ్బంది దృష్ట్యా నాలా చట్టం రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అభివృద్ధి ఫీజులు వసూలు చేసి మున్సిపాలిటీ, పంచాయతీల అభివృద్ధికి ఖర్చు చేస్తామని చెప్పారు.