AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై చిన్నారుల భద్రత కోసం ప్రభుత్వం వినూత్న చర్యలు చేపట్టింది. వారి చేతికి ప్రత్యేక క్యూఆర్ కోడ్ బ్యాండ్లను కడుతున్నారు. ఈ బ్యాండ్ స్కాన్ చేస్తే పిల్లల పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నంబర్లు వంటి సమాచారం అందుబాటులోకి వస్తుంది. ఎవరైనా చిన్నారి తప్పిపోతే ఆ బ్యాండ్ స్కాన్ చేసి తల్లిదండ్రులను ఫోన్ ద్వారా సంప్రదించే సౌకర్యం కల్పించారు.