ఆసియాకప్‌లో దూసుకెళ్తున్న టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ తరచూ మారుతోంది. నిన్నటి మ్యాచ్‌లో దూబే వన్ డౌన్ బ్యాటింగ్‌కు రాగా, శాంసన్ అసలికే రాలేదు. ఒమన్‌పై సూర్య ఆడలేదు. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు కొనసాగుతాయని సూర్య పరోక్షంగా తెలిపాడు. ప్రత్యర్థి బౌలింగ్, పిచ్‌ని బట్టి నిర్ణయాలు ఉంటాయని, ఇకపైనా కొనసాగుతాయన్నాడు.