PPM: మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు, ఉద్యోగ విరమణ పొందిన అధికారులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఎస్పీ ఎస్.వీ.మాధవరెడ్డి తెలిపారు. పోలీసు సంక్షేమంలో భాగంగా పోలీసు శాఖలో విధులు నిర్వహించి, ఉద్యోగ విరమణ పొందిన అధికారులు, దివంగత పోలీసు ఉద్యోగుల కుటుంబాలతో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఎ.ఆర్.డీఎస్పీ థామస్ రెడ్డి పాల్గొన్నారు.