NLG: ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేదలకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం దేవరకొండ ఏరియా ఆసుపత్రికి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవలు, ఆసుపత్రికి వచ్చిన రోగుల ఓపీ, ఏఎన్సీ, శానిటేషన్ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అంతేగాక వివిధ రకాల రిజిస్టర్ల నిర్వహణను ఆమె పరిశీలించారు.