BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో విశాఖపట్నం గాజువాకకు చెందిన లలిత్ కిషోర్, రూపవాణి దంపతులు స్వామివారి అన్నదానం నిమిత్తం లక్ష విరాళాన్ని ఆలయ ఈవో దామోదర్‌కు బుధవారం అందించారు. వారిని ఆలయ ఈవో సాలువాతో సన్మానించి స్వామివారి ప్రసాదం అందజేశారు. అనంతరం భద్రాద్రి రామయ్య మూలవిరాట్‌ను దర్శించుకున్నారు.