HYD: నల్లకుంట శంకరమఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు మూడవ రోజుకు చేరుకున్నాయి. శ్రీ శారదాంబ అమ్మవారు మహేశ్వరీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి ఆశీర్వదిస్తున్నారు. ప్రత్యేక పూజలతో దేవాలయం ఆధ్యాత్మిక వాతావరణంలో నిండిపోయింది. ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి, అమ్మవారి దివ్య దర్శనాన్ని పొందుతున్నారు.