VSP: ఆపరేషన్ లంగ్స్ కొనసాగుతోందని, ఇందులో ఎటువంటి మార్పు ఉండదని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. విశాఖలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకే ఆపరేషన్ లంగ్స్‌కు శ్రీకారం చుట్టామన్నారు. అయితే చిరు వ్యాపారులకు హాకర్స్ జోన్ ఏర్పాటు చేసి వారి ఉపాధికి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.