KMM: సవరించిన GSTని ప్రతి దుకాణంలో తక్షణమే అమలు చేయాలని మధిర మండల బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీహరి చౌదరి అన్నారు. సవరించిన వస్తు సేవల పన్నులను ప్రజలకు అందుబాటులో తీసుకురావాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మంగళవారం మధిరలో నిర్వహించిన సమావేశంలో చెప్పారు. పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్నుల భారాన్ని తగ్గించిందన్నారు.