ప్రకాశం: కనిగిరి ఆర్టీసీ డిపో పరిధిలో బుధవారం డయల్ యువర్ డీఎం నిర్వహించనున్నట్లు మేనేజర్ మహమ్మద్ సయానా బేగం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఉదయం 10:30 నుంచి 11:30 గంటల వరకు 9959225701 నంబర్‌కు కాల్ చేసి డిపో పరిధిలోని సమస్యలు, బస్సుల ఏర్పాటు తదితర అంశాలపై సూచనలు, సలహాలు చెప్పవచ్చన్నారు.