ప్రకాశం: గిద్దలూరులో అమానుష ఘటన వెలుగు చూసింది. ఓ ప్రైవేటు వైద్యశాలకు సోమవారం అర్ధరాత్రి ప్రసవ వేదనతో ఓ గర్భిణీ వచ్చింది. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో టాయిలెట్ వద్ద మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆ బిడ్డను అక్కడే వదిలి వెళ్లిపోయింది. వైద్య సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ మహిళ ఎవరు, ఎందుకు అలా చేసింది, అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.