అంతకకు ముందు వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరో విజయ్ దేవరకొండకి.. పాన్ ఇండియా ఫిల్మ్ ‘లైగర్’ కూడా ఊహించని దెబ్బేసింది. దాంతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నరౌడీ కల.. కల గానే మిగిలిపోయింది. అందుకే రౌడీకి నెక్ట్స్ సినిమా రిజల్ట్ రౌడీకి కీలకంగా మారింది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ అనే సినిమా చేస్తున్నాడు. బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటిస్తోంది. డిసెంబర్లోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ.. సమంత హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల.. అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ కాలేదు. దాంతో వచ్చే సమ్మర్‌కు పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ గ్యాప్‌లో మరో కొత్త సినిమాను మొదలు పెట్టాలని చూస్తున్నాడు విజయ్.
ఈ క్రమంలో గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయబోతున్నాడని వినిపిస్తోంది. అలాగే ఇంకొన్ని ప్రాజెక్ట్స్ కూడా లైన్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు విజయ్ ఓ మళయాళ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పినట్టు సమాచారం. మళయాళ స్టార్ హీరో మోహన్‌లాల్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడని తెలుస్తోంది. ‘వృషభ’ అనే సినిమాలో విజయ్ దేవరకొండ..
మోహన్‌లాల్ కొడుకుగా కనిపించనున్నాడట. నందకిషోర్ దర్శకత్వంలో భారీ పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. మలయాళంతో పాటు తెలుగులోను ఈ చిత్రాన్ని భారీగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే విజయ్ ఈ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడా లేదా అనే విషయంలో.. ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.