»Ka Paul Lashes Out At Pawan Modi Kcr Jagan Chandrababu
KA Paul: మోడీ, కేసీఆర్ డబ్బులు అడుక్కుంటే ఇచ్చా.. అంతా గొర్రెలు, నేను జోకర్ను కాదు…
స్టీల్ ప్లాంట్ కోసం తాను కోర్టుకు వెళ్లిన విషయం తెలిసి తనకు మొదటిసారి అక్కడ పాలాభిషేకం చేశారన్నారు కేఏ పాల్. తన జీవితంలో పాలాభిషేకం ఇదే తొలిసారి అన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ (visakha steel plant privatization) జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు (praja shanthi party ka paul). సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణతో (cbi కలిసి విశాఖపట్నంలో మీడియా సమావేశం నిర్వహించారు (KA Paul and JD Lakshminarayana Press Meet). ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై (steel plant privatization) కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతోందన్నారు (central government). వైసీపీ నుండి అంతమంది ఎంపీలు ఉన్నప్పటికీ, ఈ ప్లాంట్ విషయంలో జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. తనకు యాక్టింగ్ రాదని, యాక్షన్ మాత్రమే వచ్చునని చెప్పారు. స్టీల్ ప్లాంట్ (steel plant) కాపాడుకోవడానికి రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేదని, లీగల్ గా పోరాటం చేయాలని చెప్పారు. వైయస్ సీఎంగా ఉన్నప్పుడు తాను 50 సార్లకు పైగా రోడ్డెక్కానని, కానీ ఫలితం లేదన్నారు. రోడ్డు ఎక్కడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదని చెప్పారు. అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తానే ముందుగా కోర్టుకు వెళ్లానని చెప్పారు.
నాకు పాలాభిషేకం చేశారు…
స్టీల్ ప్లాంట్ కోసం తాను కోర్టుకు వెళ్లిన విషయం తెలిసి తనకు మొదటిసారి అక్కడ పాలాభిషేకం చేశారన్నారు. తన జీవితంలో పాలాభిషేకం ఇదే తొలిసారి అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కాకుండా ఉండేందుకు అవసరమైతే తానే డబ్బులు ఇస్తానని చెప్పారు. తన వద్ద అమెరికన్ ఫండ్ ఉందని, వాటిని మూడు నెలల్లో స్టీల్ ప్లాంట్ కోసం ఇస్తానని చెప్పారు. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ వంటి వారి నుండి తనకు డబ్బులు వస్తాయని, ఆ డబ్బును విశాఖ స్టీల్ ప్లాంటు ప్రయివేటీకరణ కాకుండా ఆపేందుకు ఇస్తానని చెప్పారు. దీనిని అంబానీ, అదానీలకు అమ్మవద్దని చెప్పారు. రూ.5 లక్షల కోట్లు గతంలో తెచ్చానని, ఇప్పుడు విశాఖ ఉక్కుకు కూడా అలాగే తెస్తానని చెప్పారు. కేంద్రానికి స్టీల్ ప్లాంట్ నిర్వహణ ఇష్టం లేకుంటే.. మా ఏపీకి అమ్మేయండి… మేం కొనుగోలు చేస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటును తాను కొనుగోలు చేయగలనని చెప్పారు. ఎనిమిదిన్నర కోట్ల మంది తెలుగు ప్రజలు ఒక్కొక్కరు రూ.100 కోట్లు ఇస్తే డబ్బులు వస్తాయని జేడీ లక్ష్మీనారాయణ చెప్పారని, కానీ అలా కుదరదని, తాను డబ్బులు ఇస్తున్నప్పుడు ఎందుకని ప్రశ్నించారు. తన ఆస్తులు అమ్మి అయినా స్టీల్ ప్లాంట్ నడుపుతానని చెప్పారు.
పవన్ నా వెంట రా… మోడీ, కేసీఆర్, బాబు అడుక్కుంటే డబ్బులిచ్చా…
తాను ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వగలనని అలాంటి, తనకు అండగా ఉండాలని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ వెంట ఎందుకు పడుతున్నారని ప్రశ్నించారు. తన వెంట రావాలని సూచించారు. ఉత్తినే పవన్ కు ఓటు వేయవద్దన్నారు. ఆయన తనతో వస్తే బాగుంటుందన్నారు. మోడీ అడుక్కుంటే తాను డబ్బులిచ్చానని, చంద్రబాబు అడుక్కుంటే డబ్బులిచ్చానని, కేసీఆర్ అడుక్కుంటే డబ్బులిచ్చానని చెప్పారు. వారు అడుక్కోవడం.. నేను ఇవ్వడం మీరు చూశారని చెప్పారు.
అంతా గొర్రెలు… కేసీఆర్ దోచుకున్నారు
ఎన్నికల్లో రూ.3వేలు ఇస్తే ఓటు వేస్తారా అని నిలదీశారు. ప్రజాశాంతి పార్టీకి అధికారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇదివరకు గొర్రెలు కసాయివాడిని నమ్మాయని.. కానీ తనని నమ్మలేదన్నారు. ఇప్పుడు తనకు ఓటు వేయాలన్నారు. స్టీల్ ప్లాంట్ పైన చంద్రబాబు, జగన్ మాట్లాడరని, అలా మాట్లాడితే జైల్లో పెడతారనే భయం ఉందన్నారు. రాజధాని కట్టలేని, ప్రత్యేక ప్యాకేజీ తేని, ప్రత్యేక హోదా తేని చంద్రబాబు.. కొడుకును సీఎం చేయడం కోసం అబద్దాలు చెబుతున్నారన్నారు. జగన్, చంద్రబాబు పెద్ద ఎత్తున దోచుకున్నారని, కేసీఆర్ అందరి కంటే ఎక్కువగా రూ.10 లక్షల కోట్లు దోచుకున్నారన్నారు. అలాంటి కేసీఆర్ స్టీల్ ప్లాంట్ చేయకుండా కాపాడుతారట అని ఎద్దేవా చేసారు. ఆయన తీరు మొదటి దానికి మొగుడు లేడు కానీ.. కడదానికి కళ్యాణమంట.. అన్న చందంగా ఉందన్నారు. కాంగ్రెస్ రూ.1 లక్ష కోట్ల అప్పులు చేస్తే.. మోడీ నెలకు రూ.1 లక్ష కోట్ల అప్పులు చేసారని ధ్వజమెత్తారు. ఇప్పుడున్న పార్టీలు, నేతలు అందరు దొంగలని, మోసగాళ్లు అన్నారు. మీరు నన్ను ఎన్నుకోకుంటే నష్టపోయేది మీరే అన్నారు.
నేను జోకర్ అనుకోవద్దు..
నేను మీలో చాలామందికి జోకర్ లా కనిపించవచ్చునని, కానీ చివరకు మీరే జోకర్ అవుతారని గుర్తుంచుకోండని అన్నారు. మీరు తనను ట్రోల్ కూడా చేయవచ్చునని, కానీ దానిని తాను పట్టించుకోనని చెప్పారు. తాను ఎనిమిది రంగాల్లో నిష్ణాతుడినని చెప్పారు. ప్రపంచంలోనే సేవన్ ఫోర్స్ ఉన్న ఏకైక వ్యక్తిని తాను అన్నారు. తనకు వేలాది ఎకరాల భూమి ఉందని, సంగారెడ్డి, కెన్యా, ఇథియోపియాలలో ఉందని చెప్పారు. తాను ఇన్నేళ్లుగా ఉన్నప్పటికీ డైనిమిక్ గా ఉన్నానని చెప్పారు. నిన్న జేడీ లక్ష్మీనారాయణతో పాటు వచ్చిన ఓ అమ్మాయి.. సర్ మీరు చాలా యంగ్ గా కనిపిస్తున్నారని, లక్ష్మీనారాయణ కంటే మీరే యంగ్ గా ఉన్నారని ప్రశంసించినట్లు చెప్పారు.