KRNL: విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్, ప్రభుత్వ కళాశాలల్లో కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థుల ఫీజు బకాయిలు ఉన్నా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందేనని ఉపలోకాయుక్త జస్టిస్ రజిని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తిరుపతిలో ఓ విద్యార్థికి సంబంధించి కోర్సు పూర్తయినప్పటికీ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంపై లోకాయుక్త సుమోటోగా కేసు నమోదు చేసి ఈ ఉత్తర్వులు జారీ చేసింది.