SRD: పుల్కల్ మండలం సింగూర్ డ్యాంలో 55,764 క్యూసెక్కుల భారీ వరద చేరుతున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ స్టాలిన్ శనివారం ఉదయం తెలిపారు. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 17.149 టీఎంసీల నీటిమట్టం ఉందన్నారు. 7 గేట్లు తెరిచి దిగువకు వదులుతున్నారు. మొత్తం 56,528 క్యూసెక్కులు నీటిని బయటకు వదిలినట్లు తెలిపారు.