ELR: పెదపాడు మండలం వట్లూరు పీహెచ్సీ పరిధిలో శనివారం స్వస్తి నారీ శక్తి పరివార్ అభినయన్ కార్యక్రమం నిర్వహించారు. మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని దెందులూరు ఏఎంసీ ఛైర్ పర్సన్ రామ సీత అన్నారు. ఈ వైద్య శిబిరంలో 263 మంది మహిళలకు వివిధ వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు.