RR: దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా షాద్ నగర్ పట్టణంలోని శ్రీనగర్ కాలనీ అభివృద్ధికమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాతని మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ.. యువత ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ, అమ్మవారి పూజల్లో పాల్గొనడం వలన చెడు అలవాట్లకు దూరంగా ఉండేందుకు దోహదం చేస్తుందన్నారు.