విశాఖ డెయిరీ పాల ఉత్పత్తుల ధరలు తగ్గించినట్లు విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆనంద్‌కుమార్ ప్రకటించారు. తగ్గించిన ధరలు ఎల్లుండి నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. దీంతో విశాఖ డెయిరీకి చెందిన 94 ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. పాలపై లీటర్‌కు రూ.3, పన్నీర్‌పై రూ.20, వెన్నపై రూ.40, నెయ్యిపై రూ.42 తగ్గించామని పేర్కొన్నారు.