TPT: తిరుపతి నగరంలో అనధికార భవన నిర్మాణాలను ప్రారంభదశలోనే అడ్డుకుని శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ మౌర్య పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు సిబ్బందిని ఆదేశించారు. నగరంలో అనధికార భవన నిర్మాణాలు ఆయా వార్డుల్లోని కార్యదర్శులు పరిశీలించి మొదటి దశలోనే నిలుపుదల చేయాలని అన్నారు. కాగా, అనధికార లేఅవుట్లు లేకుండా చూసుకోవాలని తెలిపారు.