KDP: భాకరాపేట చెక్ పోస్ట్ సమీపాన శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కడప నుంచి బైక్పై ముగ్గురు వ్యక్తులు అతివేగంగా వస్తూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో కమల్ అనే యువకుడి తలకు బలమైన గాయాలయ్యాయి. కాగా, రితీశ్ అనే వ్యక్తికి ఎడమ కాలు పూర్తిగా దెబ్బతింది. మున్నా అనే యువకునికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని 108 సిబ్బంది గాయపడిన వారిని చికిత్స కోసం కడప రిమ్కు తరలించారు.