ప్రముఖ నటుడు మోహన్ లాల్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ‘శ్రేష్ఠత, బహుముఖ ప్రజ్ఞకు ప్రతీక. ఆయన కృషితో మలయాళ సినిమా రంగంలో ప్రముఖుడిగా నిలుస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాలలో కూడా అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన సాధించిన విజయాలు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.