»Is There Any Mandatory To Buy Gold On Akshaya Tritiya
Akshaya tritiya: అక్షయ తృతీయ రోజు నిజంగా బంగారం కొనాలా?
హిందూమతంలో అక్షయ తృతీయ(Akshaya tritiya) చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజున ఏది కొనుగోలు చేసినా తరగని పుణ్యాలు లభిస్తాయి. లక్ష్మిని ప్రసన్నం చేసుకోవడానికి ఇది ఉత్తమమైన రోజు అని నమ్ముతారు. ఈ రోజు బంగారం కొనే సంప్రదాయం కూడా ఉంది. అయితే గోల్డ్ కొనడం తప్పనిసరియా లేదా కాదో ఇప్పుడు చుద్దాం.
అక్షయ తృతీయ(Akshaya tritiya) అనగానే ఎవరికైనా బంగారమే గుర్తుకు వస్తుంది. అందరూ ఆ రోజున కనీసం గ్రాము అయినా బంగారం కొనాలని ఆరాటపడుతూ ఉంటారు. ఇదే అదనుగా బంగారం దుకాణాల యజమానులు మగువలను ఆకర్షించేందుకు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తారు. తరుగు, మెరుగు అంటూ ఏవో అర్థంకానివన్నీ చెప్పి..అక్షయ తృతీయ రోజు మాత్రం బంగారం దుకాణాల దగ్గర క్యూ కట్టేలా చేస్తారు.
నిజానికి అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు. ఇదంతా వ్యాపారాలను పెంచుకునేందుకు కొందరు చేస్తున్న ప్రచారం మాత్రమే అంటారు కొందరు పండితులు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బంగారం అహంకారానికి ప్రతీక. కలిపురుషుడు నివసించే ఐదు ముఖ్యమైన ప్రదేశాల్లో బంగారం ఒకటి. అంటే ఏరీకోరి కలిపురుషుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నట్టు.
అసలు శాస్త్రాల ప్రకారం.. అక్షయ తృతీయ రోజు బంగారం ప్రస్తావన ఉంది. అయితే కొనాలని కాదు దానం చేయమని. ఈ రోజు బంగారం కొనుగోలు చేయడం కన్నా దానం చేయడం ఉత్తమం. అందరకీ బంగారం దానం చేసేంత స్తోమత ఉండదు కాబట్టి…ఏదో ఒకటి దానం చేయడం వల్ల పుణ్యం అక్షయం అవుతుంది. అంతే కానీ… బంగారం కొనమని కాదు అని పలువురు నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి:Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ ఎప్పుడు జరుపుకుంటారు..ప్రత్యేకత తెలుసా మీకు?