AP: జగన్కు పరిణితి లేక అసెంబ్లీకి రావడం లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు. అపోజిషన్ వస్తేనే అసెంబ్లీ బాగుంటుందని అన్నారు. అసెంబ్లీలో నెంబర్ ముఖ్యం కాదని.. ప్రజాసమస్యలను లేవనెత్తడమే ముఖ్యమని తెలిపారు. స్వపక్షంలో విపక్షంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని అన్నారు. జగన్ ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మరని చెప్పారు.