AP: రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని విజయవాడ ACB కోర్టులో ప్రవేశపెట్టారు. ఇవాళ్టితో రిమాండ్ గడువు ముగియడంతో మరోసారి కోర్టు ముందు పోలీసులు హాజరుపరిచారు. లిక్కర్ స్కామ్ కేసులో కస్టడీ పిటిషన్పై కూడా విచారణ జరిపారు. దీంతో 2 రోజుల సిట్ కస్టడీకి ACB కోర్టు అనుమతి ఇచ్చింది. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డిని అధికారులు విచారించనున్నారు.