PLD: రొంపిచర్లలో కొలువైన శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 6వ రోజు శనివారం అమ్మవారు మహాకాళి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆర్యవైశ్య సంఘం, ఆలయ అధ్యక్షులు మద్ది రామచంద్ర రావు, అర్చకులు వేముల రావు శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.