»Indian Couple Killed In Dubai Fire Was Preparing Iftar For Neighbours
Iftar సిద్ధం చేస్తే.. ప్రమాదంతో భారతీయ దంపతుల మృతి
దుబాయ్‌లో ఓ అపార్ట్మెంట్లో ప్రమాదం జరగగా.. ఇద్దరు భారతీయ దంపతులు చనిపోయారు. తమ అపార్ట్మెంట్లో ఉండే ముస్లింల కోసం ఇఫ్తార్ విందు రెడీ చేయగా.. ప్రమాదం జరగడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
Indian Couple Killed In Dubai Fire Was Preparing Iftar For Neighbours
Indian Couple Kill:దుబాయ్‌లో (dubai) ఓ అపార్ట్మెంట్లో జరిగిన ప్రమాదంలో 16 మంది చనిపోయిన (16 died) సంగతి తెలిసిందే. అందులో నలుగురు భారతీయులు (4 indians) ఉన్నారు. ఇద్దరు తమిళనాడు (tamilnadu) కాగా.. మరో ఇద్దరిది కేరళ (kerala).. వీరిద్దరూ భార్య భర్తలు రిజేశ్ (rijesh), జేషి (jeshi) అని తెలిసిందే. తమ ప్లాట్‌లో ముస్లింల కోసం ఇఫ్తార్ విందు (విషుసాధ్య) ప్రిపేర్ చేసిన రోజే భవనంలో మంటలు చెలరేగాయి. విషుసాధ్య అంటే హిందువుల పండగా.. తమ తోటి ముస్లింలకు వెజిటేరియన్‌తో భోజనం పెట్టడంతో ఆ రోజు వారి ఉపవాసం ముగుస్తోంది. శనివారం భోజనాలు ప్రిపేర్ చేస్తుండగా ఆల్ రాస్ ఏరియాలో గల భవనంలో భవనంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణం సరయిన భద్రతా ప్రమాణాలను పాటించకపోవడమే అని తెలిసింది.
రిజేష్ ట్రావెల్ అండ్ టూరిజం కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య స్కూల్ టీచర్‌గా వర్క్ చేస్తున్నారు. శనివారం రోజున విషు పండగ చేసుకోవాలని.. వంటలను ప్రిపేర్ చేస్తున్నారు. అరటి ఆకులో భోజనం పెట్టి.. వడ్డించేందుకు సిద్దం చేశారు. కేరళకు (kerala) చెందిన ముస్లింలను పిలువాలని అనుకున్నారు.. ఇంతలోనే ప్రమాదం వారిని కబళించింది.
406 ప్లాట్‌లో రిజేష్ ఫ్యామిలీ (rijesh family) ఉంటోంది. 405 ప్లాట్ నుంచి మంటలు వ్యాపించాయి. విషు పండగకే కాదు ఓనమ్ (onam), ఇతర పండగలకు కూడా తమను ఇన్వైట్ చేస్తారని 409 ప్లాట్‌లో నివసించే రియాస్ తెలిపారు. ఆ రోజు ఉదయం ప్లాట్ బయట టీచర్‌ను చూశానని.. మధ్యాహ్నం టీచర్ ఏడవడం వినిపించిందని తెలిపారు. వారికి ఫోన్ చేసినా లిప్ట్ చేయలేదని.. శనివారం మధ్యాహ్నాం 12.35 గంటలకు చివరిసారిగా రిజేష్ స్టేటస్ చూశానని తెలిపారు. తమకు సాయం చేసిన వ్యక్తి ఇలా ప్రమాదంలో చనిపోయాడని నమ్మలేకపోతున్నాం అని పేర్కొన్నారు. తమకు ప్లైట్ టికెట్స్ కూడా బుక్ చేశారని తెలిపారు.
తమ పక్కింటి వారిని కోల్పోయామని మరొకరు బాధపడ్డారు. రోజు తమను కలిసి.. మాట్లాడేవారని గుర్తుచేసుకున్నారు. తిరిగి తాము అదే చోట.. 16 మంది లేరని తెలసి ఎలా ఉండాలని బాధపతున్నారు. మధ్యాహ్నం 12.35 గంటలకు మంటలు చెలరేగగా.. 2.42 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయని దుబాయ్ సివిల్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ ప్రకటన చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు మూడో ప్లోర్లో ఉన్న వారిని క్రేన్ల ద్వారా రక్షించారు.