SRD: పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టుకు వరద ఏమాత్రం తగ్గలేదు. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు 47,795 క్యూసెక్కులు ఇన్ ఫ్లో కొనసాగిందని ప్రాజెక్టు అధికారి మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు 6 గేట్ల ద్వారా 48,242 క్యూసెక్కులు నీళ్లు విడుదలవుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా ప్రాజెక్టు నీటిమట్టం 16.870 టీఎంసీలు వద్ద నిల్వ ఉందని అధికారి తెలిపారు.