WNP: వనపర్తి పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు గన్నోజు మోహనాచారి ఆధ్వర్యంలో బ్రహ్మంగారి దేవాలయంలో ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలు స్వశక్తితో ఎదగాలని కోరారు. ఇంట్లోనే మహిళలకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.