పాకిస్తాన్ ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్లు కరచాలనం చేయని విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై పాక్ మాజీ కెప్టెన్ మహ్మద్ యూసఫ్ నోరు పారేసుకున్నాడు. దీనిపై మాజీ క్రికెటర్ మదన్‌లాల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాక్ ఆటగాళ్ల చదువూ, సంస్కారం ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశాడు. భారత్ దెబ్బకు వారి మైండ్ బ్లాంక్ అయిందని పేర్కొన్నాడు.