1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్య్రం పొందినా హైదరాబాద్ సంస్థానం నిజాం, రజాకార్ల పాలనలోనే ఉండిపోయింది. దీంతో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఉధృతమైంది. ప్రజలు ‘నీ బాంచెన్ దొర’ అనే బానిసత్వం నుంచి ‘బానిసత్వం పోవాలి’ అనే నినాదంతో పోరాడారు. దాని ఫలితంగానే 1948 సెప్టెంబర్ 17న ‘ఆపరేషన్ పోలో’ ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైంది. అదే నేటి తెలంగాణ విమోచన దినోత్సవం.