TG: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాష్ట్రానికి మరో 2 లక్షల టన్నుల యూరియా ఇవ్వాలని కేంద్రమంత్రి అనుప్రియా పటేల్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ.. 1968 నాటి విత్తన చట్టంలో మార్పులు చేసి, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో నూతన చట్టాన్ని ఆమోదించాలని కోరినట్లు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని రైతు సంక్షేమ పథకాలు TGలో అమలవుతున్నాయన్నారు.